తుంగభద్రలో ఆడశిశువు మృతదేహం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): భేటీ బచావో (ఆడపిల్లను రక్షించండి) నినాదాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ నలుమూలలా మార్మోగిస్తున్నా.. ఆడశిశువు నిరాదరణకు గురవుతునే ఉందని చెప్పేందుకు ఇదిగో ఈ ఘటన నిదర్శనం. నగర శివార్లలోని రైల్వే బ్రిడ్జి కింద తుంగభద్ర నదిలో సోమవారం స్థానికులు ఆడశిశువు మృతదేహాన్ని గుర్తించారు. శరీరం ఉబ్బి ఉండటాన్ని బట్టి రెండు రోజుల క్రితమే పారవేసినట్లు తెలుస్తోంది.