‘ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలి’
Published Sun, Aug 28 2016 8:13 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
బేల : మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆదివాసీ సంక్షేమ, విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఏడో రోజు ఆదివారం కొనసాగింది. కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షుడు ఆడే శంకర్, ప్రధాన కార్యదర్శి పుసాం రాజేశ్వర్, ఉపాధ్యక్షుడు ఆడే సంతోష్, ఆదివాసీ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు పెందుర్ రాందాస్, ప్రధాన కార్యదర్శి కొవ విజయ్, చప్రాల సర్పంచ్ మేస్రాం దౌలత్‌రావు, బాది మాజీ సర్పంచ్ సలాం దేవ్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
దీక్షకు సంఘీభావం..
మండల కేంద్రంలో ఏడో రోజు ఆదివారం కొనసాగిన ఆదివాసీల రిలే నిరాహార దీక్షలో సంఘీభావంగా కొమురం భీమ్ ఆశయసాధన కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు కొవ దౌలత్‌రావు, ఉపాధ్యక్షుడు ఎం. కష్ణ, సభ్యులు పెందుర్ కేశవ్, మడావి శంభు, మందాడి లక్ష్మణ్, ఛత్రుగన్, ఏం. గంగారాం, శ్రీకాంత్, ఆత్రం గంగారాం, ఇచ్చోడ, నేరడిగొండ మండలాల ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.
Advertisement