కృష్ణా జలాలు అందించడంలో ప్రభుత్వం విఫలం
కృష్ణా జలాలు అందించడంలో ప్రభుత్వం విఫలం
Published Sat, Sep 3 2016 9:57 PM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM
తిప్పర్తి : కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాలో సగానికి పైగా గ్రామాలకు కృష్ణా జలాలు ఏ ఇబ్బందులు లేకుండా అందించామని, ప్రస్తుత ప్రభుత్వం ఐదు నెలలుగా కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా, కృష్ణా జలాల సరఫరా చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పెద్ద సూరారంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని నీటి శుద్ది కేంద్రాల్లో మోటార్లు పనిచేయడం లేదని, వాటిని మార్చాలని మార్చి నెలలో సీఎం కేసీఆర్‌ను కలిసి వివరించినట్లు తెలిపారు. గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా ఇస్తుంటే వాటిని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లులు, నీటి బిల్లుల పేరుతో లాగేసుకుంటుందని అన్నారు. ఏఎమ్మార్పీ ద్వారా తాగునీటితో పాటు చెరువులను నింపేందుకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అంతకుముందు అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని, అదే విధంగా అనారోగ్యంతో మృతి చెందిన జాకటి మంగమ్మ కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, డీసీసీబీ డైరెక్టర్‌పాశం సంపత్‌రెడ్డి, జూకూరు రమేష్, ఎంపీటీసీలు లొడంగి వెంకటేశ్వర్లు, కిన్నెర అంజి, నాయకులు ఎర్రమాద రత్నారెడ్డి, నారగోని భద్రయ్య, సురిగి రామకృష్ణగౌడ్, బద్దం సైదులు, నర్సిరెడ్డి, అంజయ్య, శ్రీరాములు పాల్గొన్నారు.
Advertisement
Advertisement