గ్రామసభలో పాల్గొన్న సర్పంచ్, తదితరులు
ఝరాసంగం: గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకేందుకే గ్రామసభలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు, సర్పంచ్‌లు తెలిపారు. మంగళవారం ఝరాసంగంతో పాటు క్రిష్ణాపూర్, చీలమామిడి, కోల్లూర్ గ్రామాలలో గ్రామపంచాయతి కార్యాలయ ఆవరణలో సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామసభలను ఏర్పాటు చేశారు.
ఈ సభలలో వీధి దీపాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యం, విద్య తదితర అంశాలపై చర్చించారు. గ్రామస్తులు, వార్డు సభ్యులు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన వారిని ఆదుకోవాలని బాధితులు కోరారు. సభలో పలు సమస్యల పరిష్కారానికి తీర్మానాలు చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. సభలలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు రుద్రప్ప పాటిల్, మల్లన్న పాటిల్, తేజమ్మ ఉప సర్పంచ్‌లు హమీద్, మహబూబ్‌అలీ పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, విజయ్‌కుమార్, రాజ్‌కుమార్, మహేశ్వర్‌రావు, వార్డుసభ్యులు నాగేశ్, బాబుకుమార్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.