నోట్ల రద్దుతో ప్రజాజీవనం ఛిన్నాభిన్నం | gutha sukhender reddy fired on notes banned | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దుతో ప్రజాజీవనం ఛిన్నాభిన్నం

Published Fri, Nov 25 2016 4:34 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

నోట్ల రద్దుతో ప్రజాజీవనం ఛిన్నాభిన్నం - Sakshi

నోట్ల రద్దుతో ప్రజాజీవనం ఛిన్నాభిన్నం

నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఫైర్

 సాక్షి, నల్లగొండ: తెలుగుదేశం, బీజేపీ పన్నిన కుట్ర వల్లే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఈ అవస్థలు వచ్చాయని, పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలోని ప్రజల జీవన వ్యవస్థ చిన్నాభిన్నమైందని నల్లగొండ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రం నిర్ణయం వల్ల సామాన్య పౌర జీవనం ఇబ్బందులు పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కుబేరుల కంటే సామాన్య ప్రజలను ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

బాబుకు అలవాటే
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై కూడా ఎంపీ తీవ్రంగా మండిపడ్డారు. పాలమ్ముకునే వ్యక్తి తలకాయలమ్ముకుం టున్నాడని తననుద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ రేవంత్‌రెడ్డి ఓ పిట్టల దొరని, అలాంటి పిట్టల దొరలను తయారు చేయడం చంద్రబాబుకు అలవాటని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement