టేకులపల్లి: మీరు చాలా రకాల కప్పలు(మండూకాలు) చూసి ఉంటారు. ఈ పసిడి రంగు కప్పలను ఎప్పుడైనా చూశారా?. అయితే ఇప్పుడు చూడండి..
పసుపు పచ్చని రంగులో ఉన్న కప్పలు వానచినుకులో చిందేశాయి. ఖమ్మం జిల్లాలోని టేకులపల్లి మండలం దంతెలతండా పరిధిలోని గుంపు కుంటలో మంగళవారం కురిసిన తొలి భారీ వర్షానికి ఈ రకం కప్పలు దర్శనమిచ్చాయి.
వాననీటిలో.. గుంపులు గుంపులుగా వందల సంఖ్యలో నీటిలో తేలియాడుతూ కప్పలు చిందులేశాయి. పసుపు పచ్చగా మెరుస్తూ కనిపించినా ఈ కప్పలను చూసేందుకు వచ్చిన అక్కడి స్థానికులను కనువిందు చేశాయి.
ఈ రంగు కప్పలను ఎప్పుడైనా చూశారా?
Published Wed, Jun 8 2016 8:17 PM | Last Updated on Mon, Sep 4 2017 2:00 AM
Advertisement
Advertisement