ఉరవకొండ ప్రాంతంలో భారీ వర్షం
ఉరవకొండ: పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ఉరవకొండ– చాబాల రహదారి వద్దభారీగా వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎర్పడ్డాయి. భారీ వర్షానికి ఉరవకొండ చెరువుతో పాటు అతిపెద్ద చెరువు అయిన బూదగవి చెరువు నిండితో నిండిపోయింది. ఉరవకొండ పట్టణంలోని అరబిక్ హైస్కూల్ పాఠశాల ఆవరణలో వర్షపు నీరు చేరడంతో విద్యార్థులు పాఠశాలలోకి వెళ్లడానికి అవస్థలు పడ్డారు. ఇది వరకే పొలాలను ముందస్తు దుక్కులు దున్ని ఎరువులు చెల్లుకున్న రైతులు వేరుశెనగతో పాటు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.