uravakonda area
-
ఉరవకొండ ప్రాంతంలో భారీ వర్షం
ఉరవకొండ: పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ఉరవకొండ– చాబాల రహదారి వద్దభారీగా వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎర్పడ్డాయి. భారీ వర్షానికి ఉరవకొండ చెరువుతో పాటు అతిపెద్ద చెరువు అయిన బూదగవి చెరువు నిండితో నిండిపోయింది. ఉరవకొండ పట్టణంలోని అరబిక్ హైస్కూల్ పాఠశాల ఆవరణలో వర్షపు నీరు చేరడంతో విద్యార్థులు పాఠశాలలోకి వెళ్లడానికి అవస్థలు పడ్డారు. ఇది వరకే పొలాలను ముందస్తు దుక్కులు దున్ని ఎరువులు చెల్లుకున్న రైతులు వేరుశెనగతో పాటు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. -
ఎంత కష్టం.. ఎంత నష్టం..
తీవ్ర వర్షాభావం నేపథ్యంలో ఉరవకొండ నియోజకవర్గ వ్యాపంగా గురువారం దాదాపు ఐదు వేల ఎకరాల్లో వేరుశనగ పంట తొలగించారు. వర్షం రాక వేరుశనగ పంట ఎండుతుండడతో కనీసం పశుగ్రాసం దక్కుతుందనే ఆశతో పంటను తొలగిస్తున్నామని రైతులు పేర్కొంటున్నారు. విడపనకల్లు, ఉరవకొండ, వజ్రకరూర్, కూడేరు వుండలాల్లో ఎక్కడ చూసినా ఈ దృశ్యాలే కనిపిస్తున్నాయి.