జీహెచ్‌ఎంసీకి హైకోర్టు సూచన
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసే గణేశ్ విగ్రహాల ఎత్తు 15 నుంచి 20 అడుగులకు మించకుండా ఉంటే బాగుంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇంతకు మించితే తప్పనిసరిగా అనుమతి తీసుకునేలా తగు చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీకి సూచించింది. ఈ కేసులో వాదనలు విని పించేందుకు న్యాయవాదిని నియమించుకునే వెసులుబాటును గణేశ్ ఉత్సవ సమితికి ఇచ్చింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలోని హుస్సేన్‌సాగర్‌తో పాటు ఇతర చెరువులు, నీటి కుంటలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడం లేదని, దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ న్యాయవాది ఎం.వేణుమాధవ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై తాత్కాలి సీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం విగ్రహాల ఎత్తు వల్ల కలిగే ఇబ్బందులను ప్రస్తావించింది. అలాగే విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
విగ్రహాల ఎత్తు 20 అడుగులకు మించొద్దు
Published Tue, Apr 12 2016 3:36 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement