
భానుడి భగభగలు
జిల్లాలో భానుడి ప్రతాపం రోజు రోజుకూ పెరిగిపోతోంది.
జిల్లాలో భానుడి ప్రతాపం రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఉదయం పది గంటలు దాటితే రోడ్లపైకి రావాలంటే జనం భయపడి పోతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. శింగనమల మండలం తరిమెలలో మంగవారం 44.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బకు గురికాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మండలం ఉష్ణోగ్రత (డిగ్రీల్లో)
శింగనమల 44.1
చెన్నేకొత్తపల్లి 42.6
పుట్టపర్తి 42.1
యల్లనూరు 41.8
కూడేరు 41.7
పుట్లూరు 41.6
బుక్కపట్నం 41.4
పామిడి 41.4
ఉరవకొండ 40.6
గుంతకల్లు 40.5
అనంతపురం 40.3
గుత్తి 40.3
కళ్యాణదుర్గం 40.3
ధర్మవరం 40.3