సకలజనుల సమ్మె వేతనాలు చెల్లించాలి
Published Tue, Jul 26 2016 10:49 PM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM
power project, finance, permenent
గోదావరిఖని :సింగరేణి కార్మికులకు సకలజనుల సమ్మె వేతనాలు జూలై నెల వేతనంతో చెల్లించాలని హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రధాన చౌరస్తాలోని యూనియన్ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. 1200 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్న సందర్భంగా ప్రతీ కార్మికునికి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఇవ్వాలని కోరారు. కోరుకున్న ప్రతీ కార్మికునికి ఎయిర్ కండీషన్ సౌకర్యం కల్పించాలని, వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించేందుకు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రతీ కార్మికునికి రెండు గుంటల భూమి, రూ.25 లక్షల రుణ సౌకర్యం కల్పించాలని, లాభాల వాటా 25 శాతం చెల్లించాలని, సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యాదగిరి సత్తయ్య, కాటిక శ్రీనివాస్, దాసరి మల్లయ్య, వై.కోటయ్య, వీరగోని మల్లయ్య, గాజుల వెంకటస్వామి, గడ్డం కొమురయ్య, సిరిపురం నర్సయ్య, కె.లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement