నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
నెల్లూరు(క్రైమ్) :
పెన్నావారది వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ బుధవారం పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కల్గకుండా చూడాలన్నారు. నిమజ్జనం జరిగే ప్రాంతంలో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగర ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనంపూర్తిచేసుకోవాలన్నారు. బాణాసంచా, మద్యం జోలికి వెళ్లకూడదన్నారు. మహిళలు, యువతులు, చిన్నారులను నిమజ్జనం జరిగే ప్రదేశాలకు తీసుకురాకూడదన్నారు. కార్యక్రమంలో నగర, ట్రాఫిక్ డీఎస్పీలు జి.వి రాముడు, నిమ్మగడ్డ రామారావు, మూడు, నాలుగు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌లు జి.రామారావు, సీహెచ్ సీతారామయ్య, జి.వెంకటరావు, ఎస్‌ఐల రామకృష్ణ, ఆర్‌ఎస్‌ఐలు శ్రీహరిరెడ్డి పాల్గొన్నారు.
నేడు డయల్ యువర్ ఎస్పీ
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి గురువారం నిర్వహిస్తోన్న డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం 8వ తేదీ ఉదయం 11 గంటలకు జరుగుతుందని ఎస్‌బీ ఎస్‌ఐ బి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇటీవల కృష్ణాపుష్కరాల సందర్భంగా కార్యక్రమం జరగలేదన్నారు. ప్రజలు తమ సమస్యలను 0861–2331700 నెంబర్ ద్వారా ఉదయం 11గంటల నుంచి 12 గంటల వరకు ఎస్పీ విశాల్‌గున్నీకి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.