అనంతపురం సప్తగిరి సర్కిల్: స్వయం ఉపాధి పథకాల కింద సబ్సిడీ రుణాలకు ఈ నెల 18 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ అభ్యర్థులకు జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం ఓ ప్రకటనలో సూచించారు. 10,427 మందికి రూ.17.48 కోట్ల లక్ష్యంతో రుణాలు మంజూరు చేస్తామన్నారు. 21 నుంచి 51 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. http://apobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి, గతంలో దరఖాస్తు చేసుకోగా రుణం మంజూరు కానీవారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలి .