- శ్రీకాకుళం జేసీగా చక్రధరబాబు బదిలీ
- పాడేరు ఐటీడీఏ పీఓగా వెళ్లనున్న రంపచోడవరం సబ్‌కలెక్టర్
ఐటీడీఏ పీఓగా దినేష్‌కుమార్
Published Sun, Nov 13 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM
రంపచోడవరం :
రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పని చేస్తున్న కేవీఎ¯ŒS చక్రధరబాబును శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేస్తు ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పశ్చిమ గోదారి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్‌గా పని చేస్తున్న దినేష్‌కుమార్‌ను నియమించింది. అలాగే రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న రవి పట్టా¯ŒSశెట్టిని పాడేరు ఐటీడీఏ పీవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందినవారు. ఏడాదిపాటు రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా పని చేశారు. సొంత రాష్ట్రం కర్ణాటక. ఆయన స్థానంలో రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా ఇంకా ఎవరినీ నియమించలేదు.
కనిపించని పీవో మార్క్ అభివృద్ధి
గతంలో ఐటీడీఏ పీవోలుగా పని చేసిన ఐఏఎస్ అధికారులు పరిపాలనలో కనీసం ఒక్క అంశంలోనైనా తమదైన ముద్ర వేసేవారు. కానీ చక్రధరబాబు ఇక్కడ సుమారు రెండేళ్లు పని చేసినా గిరిజనుల కోసం ఎలాంటి ప్రత్యేక పథకాలూ అమలు చేయలేదు. క్షేత్రస్థాయి సందర్శనలు కూడా అంతంతమాత్రమనే చెప్పాలి. కేవలం అధికారులతో సమీక్షలు, రోజువారీ పరిపాలనకే పరిమితమయ్యారు. ఐటీడీఏలోని కింది స్థాయి ఉద్యోగిపై ప్రాజెక్టు అధికారి హోదాలో చక్రధరబాబు ఒకసారి చేయి చేసుకున్నారు. దీంతో ఆదివాసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఆందోళన చేశాయి. ఉన్నతాధికారుల జోక్యంతో ఆ గొడవ సద్దుమణిగింది. 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన చక్రధరబాబు 2015 ఏప్రిల్‌లో ఐటీడీఏ పీవోగా బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా పని చేస్తూ రంపచోడవరం పీవోగా బదిలీపై వచ్చారు. ఐఏఎస్ రాక ముందు ఐపీఎస్ హోదాలో అస్సాం రాష్ట్రంలో ఎస్పీ హోదాలో పని చేశారు.
నర్సాపురం సబ్ కలెక్టర్ నుంచి ఐటీడీఏ పీవోగా:
రంపచోడవరం ఐటీడీఏ కొత్త పీవోగా నియమితులైన దినేష్‌కుమార్ తమిళనాడు విరుద్‌నగర్ జిల్లాలోని మారుమూల గ్రామం మానూరులో 1982 ఆగస్ట్ 26న జన్మించారు. ఆయన తండ్రి మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన రైతు. తల్లి గృహిణి. 2009లో ఇండియ¯ŒS రెవెన్యూ సర్వీస్‌కు ఎంపికైన ఆయన కొంతకాలం ఆదాయ పన్ను శాఖలో పని చేశారు. 2013లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అనంతపురంలో ట్రైనీ కలెక్టర్‌గా పని చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పని చేస్తూ.. నర్సాపురం సబ్ కలెక్టర్‌గా 2015 డిసెంబర్ 8న బాధ్యతలు స్వీకరించారు. ఆయన సతీమణి విజయా కృష్ణ¯ŒS కూడా ఐఏఎస్ అధికారే. 2013 బ్యాచ్‌కు చెందిన ఆమె రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్‌గా పని చేస్తున్నారు.
Advertisement
Advertisement