చేప పిల్లలను చెరువులో వదులుతున్న మంత్రి
మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేటవ్యసాయం :
వృత్తిదారుల జీవనోపాధికి ప్రభుత్వం కృషిచేస్తోందని రాష్ట్ర విద్యుత్,ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని సద్దుల చెరువులో చేప పిల్లలను వదిలిన అనంతరం ఆయన మాట్లాడారు. మత్స్యకారుల్లో స్థైర్యాన్ని నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేప పిల్లల పంపిణీకీ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. జిల్లాలో 2017లో 2కోట్లు 11లక్షల చేప పిల్లలను పెంచడం ద్వారా 13 వేల కుటుంబాలకు రూ.10కోట్ల ఆదాయం లభించినట్లు తెలిపారు. ఈ సంవత్సరం జిల్లాలోని చెరువులలో 5కోట్ల చేప పిల్లలను వదులుతున్నట్లు తె లిపారు.
గతంలో చేప పిల్లలు విత్తనా లు, మార్కెటింగ్ కొరకు దళారులపై ఆ« దారపడినారని తెలిపారు. తెలంగాణ ప్ర భుత్వం వృత్తిదారుల జీవనోపాధిని, ఆ దాయాన్ని పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. అందులో భా గంగానే వందశాతం సబ్సిడీతో చేప పిల్లల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి పాలనలో సాగునీటి రంగంపై చూపిన వి వక్ష వలన వ్యవసాయం, దాని అనుబం ధ రంగాలు దెబ్బతిని ఆర్థిక వ్య వస్థ చితి కిపోయినట్లయ్యిందన్నారు. అనంతరం చేప పిల్లల కార్యక్రమంపై ముద్రించిన మార్గదర్శకాల కరపత్రాన్ని మంత్రి విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్, ము న్సిపల్‌చైర్‌పర్సన్ గండూరి ప్రవళ్లిక, మార్కెట్ కమిటీ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, గ్రంధాలయ కమిటీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఆర్డీవో మోహన్‌రావు, మత్స్యశాఖ అధికారి సౌజన్య పాల్గొన్నారు.