'వాళ్లు పచ్చి అవకాశవాదులు'
మహబూబ్నగర్: టీఆర్ఎస్ ప్రభుత్వానికి విధివిధానాలు లేవని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... 2013 నాటి భూసేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. భూసేకరణ చట్టం అమలు చేయకుంటే నిరసనలు చేపడతామని, అవసరమైతే కోర్టుకు వెళతామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీని వదలిపెట్టి ఇతర పార్టీల్లోకి వెళ్లినవాళ్లు పచ్చి అవకాశవాదులని పేర్కొన్నారు. వచ్చే రెండున్నరేళ్లలో సత్తా చాటుతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ పచ్చి అవకాశవాది అని అంతకుముందు ధ్వజమెత్తారు. తెలంగాణ సాధన ఫలితాలు కాంగ్రెస్ పార్టీకే కాదు, రాష్ట్రంలో ఏ వర్గానికి దక్కలేదని జైపాల్ రెడ్డి అన్నారు.