అమ్మృతమూర్తి
అమ్మృతమూర్తి
Published Wed, Dec 7 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
కంటేనే అమ్మ అని అంటే ఎలా...అని ప్రశ్నిస్తూ అమ్మే కాదు అమృత మూర్తి అని అంటున్నారు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితతో అనుబంధం ఉన్న తమిళులు. ఆ ఆత్మీయతను గుర్తు చేసుకుంటూ విలవిల్లాడుతున్నారు. జయలలిత మరణం జిల్లాలోని పలు వర్గాలను కంటతడి పెట్టించింది. రాజమహేంద్రవరానికి 1981లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి జయలలిత వచ్చారు. అనంతరం 85,86 సంవత్సరాల్లో కూడా రెండుసార్లు వివిధ పనులపై ఇక్కడకు వచ్చారు.
జయలలితతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జిల్లావాసులు
ఆమె సేవలు అజరామరం ∙
ఆమె మృతి తీరనిలోటు
రాజమహేంద్రిలో స్థిరపడ్డ తమిళులు
సాక్షి, రాజమహేంద్రవరం : ‘‘అమ్మ (జయలలిత) ఈ లోకం విడిచి వెళ్లిందంటే నమ్మలేకపోతున్నాం. పేద ప్రజలను తన కన్నబిడ్డల్లా చూసుకుంది. ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. అలాంటి ’అమ్మ’ లేని లోటు తీరనిది’ అంటూ తమిళవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నర నెలలపాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఆరోగ్యంగా ఇంటికి వస్తుందనుకున్న తరుణంలో ఇలా జరగడంపై తమిళవాసులు విచారం వ్యక్తం చేశారు. శ్రీలంక, బర్మా దేశాలలో స్థిరపడిన తమిళవాసులను 1969లో తిరిగి దేశానికి పిలిపించిన ఇందిర వారికి దేశంలో పలు ప్రాంతాల్లో పునరావాసం కల్పించారు. ఇళ్లు, ఉపాధి చూపించారు. అలాంటి వారిలో 100 కుటుంబాల వారు రాజమహేంద్రవరంలో స్థిరపడ్డారు. స్థానిక లాలాచెరువు ప్రాంతంలో ఆర్‌సీఎస్ స్పిన్నింగ్ మిల్లులో వీరందరూ పనిచేసి ఉపాధి పొందేవారు. 1999లో నష్టాల పేరుతో ఈ కంపెనీని మూసివేయించిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం.. రెండేళ్ల అనంతరం 2001లో ప్రైవేటు వ్యక్తులకు ఈ కంపెనీని విక్రయించింది. అప్పటి నుంచి వీరందరూ ఏరోజుకారోజు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరి అన్నదమ్ములు, బంధువలు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో ఉన్నారు. స్థానికంగా ఉంటున్న పొన్నుస్వామి సాంతకుమార్ ఇంటిలో శుభకార్యానికి వచ్చిన కొంత మంది తమిళులు సీఎం జయలలిత తమకు పలు పథకాల ద్వారా చేసిన మేలును ’సాక్షి’కి వివరిస్తూ ’అమ్మ’ మృతిపై ఆవేదనను వ్యక్తం చేశారు.
Advertisement