కృష్ణాజిల్లాలో పులులు సంచరిస్తున్నాయన్న వదంతులను ప్రజలు నమ్మెద్దని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు.
విజయవాడ: కృష్ణాజిల్లాలో పులులు సంచరిస్తున్నాయన్న వదంతులను ప్రజలు నమ్మెద్దని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. ఆగిరిపల్లి మండలం సూరవరం గ్రామంలో కొంతకాలంగా చిరుతపులి తిరుగుతుందని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు పులి సంచరించినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని చెప్పారు. కొందరు ఆకతాయిలు వీధి కుక్కకు రంగులు వేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు భయపడవద్దని అధికారులు సూచించారు. ఇలాంటి పనులు చేసే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.