పుష్కర భక్తులకు ఉచితంగా పులిహోర ప్యాకెట్ల పంపిణీ
పుష్కర భక్తులకు ఉచితంగా పులిహోర ప్యాకెట్ల పంపిణీ
Published Wed, Aug 10 2016 11:29 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
మిర్యాలగూడ : కృష్ణాపుష్కర భక్తులకు దామరచర్ల మండలం వాడపల్లిలో ఉచితంగా పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేయనున్నట్లు మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి రమేష్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పుష్కర భక్తులకు సుమారు 10 లక్షల రూపాయల విలువైన పులిహోర, మంచినీళ్ల ప్యాకెట్లు 12 రోజుల పాటు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతి రోజు నాలుగు నుంచి ఐదు వేల పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేస్తామని తెలియజేశారు. మొదటి రోజు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. సమావేశంలో పంపిణీ కన్వీనర్ రేపాల లింగయ్య, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శులు గౌరు శ్రీనివాస్, గుడిపాటి శ్రీనివాస్, మిల్లర్స్ ప్రతినిధులు రేపాల అంతయ్య, కన్నెగుండ్ల రంగయ్య, పురుషోత్తం, నాగేశ్వర్‌రావు, లవకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement