చదరంగంలో చిచ్చరపిడుగులు | little stars in chess | Sakshi
Sakshi News home page

చదరంగంలో చిచ్చరపిడుగులు

Published Sat, Sep 3 2016 10:33 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

చదరంగంలో చిచ్చరపిడుగులు

చదరంగంలో చిచ్చరపిడుగులు

  •  చెస్‌లో రాణిస్తున్న చిన్నారులు 
  •  చిన్నతనం నుంచే ప్రత్యేక శిక్షణ
  •  
    మహబూబ్‌నగర్‌ క్రీడలు: చిన్నతనం నుంచే చిన్నారులు చదరంగంలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సత్తా చాటుతున్నారు. తల్లిదండ్రుల సహకారం, కోచ్‌ల ప్రత్యేక శిక్షణతో రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. హైదరాబాద్‌ వరకే పరిమితమైన చదరంగం ఇప్పుడిప్పుడే జిల్లాలకు విస్తరిస్తోంది. రాష్ట్రస్థాయి టోర్నీలు ఎక్కడ జరిగినా తమ పిల్లలు పాల్గొనేలా వారి తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. చెస్‌లో అమోఘం ప్రతిభ కనబరుస్తున్న కొంతమంది చిన్నారులు ఫిడే రేటింగ్‌ను సాధించి, ముందుకు సాగుతున్నారు. మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న రాష్ట్రస్థాయి చెస్‌ టోర్నీల్లో పాల్గొంటున్న క్రీడాకారుల వివరాలు.. 
     
    ఎనిమిదేళ్లకే స్టాలిన్‌కు ఫిడే రేటింగ్‌
    నాగర్‌కర్నూల్‌కు చెందిన ఎనిమిదేళ్ల స్టాలిన్‌ చిన్నవయస్సులోనే 1100 ఫిడే (వరల్డ్‌ చెస్‌ ఫెడరేషన్‌) రేటింగ్‌ సాధించాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ రేటింగ్‌ టోర్నీలో ఐదుగురు అంతర్జాతీయ రేటింగ్‌  క్రీడాకారులతో తలపడి ఫిడే రేటింగ్‌ పొందాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఫిడే సాధించిన చెస్‌ క్రీడాకారుల్లో స్టాలిన్‌ అత్యంత చిన్నవాడు కావడం విశేషం. జాతీయస్థాయిలో గతేడాది చెన్నైలో జరిగిన చాంపియన్‌షిప్‌లో ఆరో స్థానంలో నిలిచాడు. రాష్ట్రస్థాయిలో గతేడాది హైదరాబాద్‌లో 
     
    గురుకుల ఆణిముత్యం లయ 
    జడ్చర్ల సాంఘిక గురుకులం స్కూల్‌కు చెందిన లయ చెస్‌లో దూసుకెళుతోంది. మూడేళ్ల నుంచి చెస్‌లో శిక్షణ తీసుకుంటోంది. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి గురుకుల స్పోర్ట్స్‌ మీట్‌లో చెస్‌లో చాంపియన్షిప్‌ను సాధించింది. గత నెల 7న జిల్లాకేంద్రంలో జరిగిన జిల్లాస్థాయి టోర్నీలో మహిళ విభాగంలో విజేతగా నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. చెస్‌లో మెరుగైన ప్రదర్శించి త్వరలోనే ఫిడే రేటింగ్‌ సాధిస్తానని లయ దీమా వ్యక్తం చేస్తోంది.  
     
    తొలిసారి రాష్ట్రస్థాయి టోర్నీకి..
    మెదక్‌కు చెందిన కౌషిక్‌ తొలిసారి రాష్ట్రస్థాయి అండర్‌–17 చెస్‌ టోర్నీలో పాల్గొంటున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రెండేళ్ల నుంచి చెస్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో చెస్‌ ఆడుతానని, భవిష్యత్‌లో జాతీయస్థాయి క్రీడాకారుడిగా ఎదుగుతానన అంటున్నాడు కౌషిక్‌. 
     
    గ్రాండ్‌ మాస్టరే ధ్యేయంగా.. ప్రణవ్‌ 
    రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రణవ్‌ చెస్‌లో విశేషంగా రాణిస్తున్నాడు. రెండుసార్లు ఇంటర్నేషల్‌ ఫిడే రేటింగ్‌ పాల్గొని సత్తాచాటాడు. ప్రస్తుతం 1189 ఫిడే రేటింగ్‌ పాయింట్లతో కొనసాగుతున్నాడు. రెండుసార్లు అండర్‌–13స్థాయిల్లో విజేతగా నిలిచిన ప్రణవ్‌ భవిష్యత్‌లో గ్రాండ్‌మాస్టర్‌ అవుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 
     
    ఎస్‌జీఎఫ్‌ చెస్‌ విజేత భానుమహేష్‌ 
    నల్లగొండ జిల్లాకు చెందిన భానుమహేష్‌ గతేడాది అండర్‌–17 ఎస్‌జీఎఫ్‌ చెస్‌లో విజేతగా నిలిచాడు. ఇప్పటివరకు ఐదుసార్లు రాష్ట్రస్థాయి టోర్నీల్లో పాల్గొన్న ఇతను చెస్‌లో మెరుగ్గా రాణిస్తున్నాడు. తల్లిదండ్రులు, కోచ్‌ల ప్రోత్సాహంతో చెస్‌లో రాణిస్తున్నానని, ఫిడే రేటింగ్‌ సాధించడమే ధ్యేయంగా ఆడుతున్నట్లు తెలిపాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement