కాంగ్రెస్, బీజేపీ రెండూ దొందుదొందే అంటూ త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ వ్యాఖ్యానించారు.
కరీంనగర్: కాంగ్రెస్, బీజేపీ రెండూ దొందుదొందే అంటూ త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు. కరీంనగర్ లో తెలంగాణ వ్యవసాయ, కార్మిక మహాసభలను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాణిక్ సర్కార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.
నల్లధనం వెలికితీస్తామని చెప్పిన నరేంద్ర మోదీ ప్రభుత్వం అందులో పూర్తిగా విఫలమయిందన్నారు. దేశంలో సామాన్యుడు బతికే పరిస్థి లేదన్నారు. రైతుల ఆత్మహత్యలకు పాలకుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆయన మండిపడ్డారు. తెలంగాణ కోసం పోరాడిన వారు భూమి కోసం, భుక్తి కోసం పోరాడాల్సిన పరిస్థితులు తలెత్తాయని మాణిక్ సర్కార్ పేర్కొన్నారు.