
వలస కూలీ ఆత్మహత్యాయత్నం
కదిరి అర్బన్ : కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లిలో మంగళవారం ఉదయం కాలెమ్మ(32) అనే వలస కూలీ విషద్రావకం తాగి ఆత్మహత్యాయత్యం చేసింది. బతుకుదెరువు కోసం తమిళనాడు నుంచి పదేళ్ల కిందట వచ్చి ఇక్కడే స్థిరపడినట్లు కాలెమ్మ తల్లి సరోజ తెలిపింది. కొంతకాలంగా విపరీతమైన కడుపునొప్పితో తమ కుమార్తె బాధపడుతోందన్నారు. ఈ క్రమంలోనే మళ్లీ నొప్పి రావడంతో తట్టుకోలేక జీవితంపై విరక్తితో ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. వెంటనే ఆమెను కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలి ంచామన్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది.