ప్రధానినే రావద్దంటారా? | Minister Harish Rao Fires on Congress leaders | Sakshi
Sakshi News home page

ప్రధానినే రావద్దంటారా?

Published Sat, Aug 6 2016 2:35 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

ప్రధానినే రావద్దంటారా? - Sakshi

ప్రధానినే రావద్దంటారా?

కాంగ్రెస్ దుర్బుద్ధికి నిదర్శనం: హరీశ్
గజ్వేల్: తెలంగాణ పర్యటనకు రావద్దంటూ ప్రధానికి లేఖ రాయడం కాంగ్రెస్ నేతల దుర్బుద్ధికి నిదర్శనమని భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఇది తెలంగాణ సంస్కృతికి విరుద్ధమన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలోని ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ‘భగీరథ’ ప్రయత్నం కాంగ్రెస్‌కు కంటగింపుగా మారిందన్నారు. ఇది పాత కార్యక్రమని చెప్పడం దారుణమన్నారు.

ఈ పథకాన్ని స్వయంగా ప్రధాని ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో ప్రశంసించడం, ప్రతిష్టాత్మక సంస్థ నీతి ఆయోగ్ సైతం కొని యాడిందని గుర్తు చేశారు. ఇలాంటి సంకుచిత మనస్తత్వంతో ముందుకు సాగితే ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోతారని కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement