మంత్రి మాట బేఖాతర్..
► పెడచెవిన పెడుతున్న మున్సిపల్ అధికారులు
► ఆసుపత్రుల వద్ద అదే తంతు..
► అంతా మా ఇష్టం అన్నట్లుగా పార్కింగ్ వ్యవహరం
ఆదిలాబాద్ కల్చరల్: పట్టణంలో జనాభా పెరుగుతోంది..రాకపోకలకు ఇబ్బందులు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. పట్టణంలో రోడ్లన్ని ఇరుకుగా మారా యి ఆసుత్రుల వద్ద పార్కింగ్ స్థలం లేకుంటే వారికి నోటీసులు ఇవ్వండి..రోడ్లపై వాహనాలు నిలిపి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడండి.. పార్కింగ్ ప్లేస్ లేని వారికి నోటీసులు ఇచ్చి.. ఫైర్‌వారికి సైతం చెప్పి వారి లెసైన్‌సను క్యాన్సల్ చేద్దాం’’ అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న ఇటీవల మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ ..ఏ ఆసుపత్రి వద్ద మున్సిపల్ నిబంధనలు కాదు కదా.. ఆయా ఆసుపత్రులు మున్సిపల్ రోడ్డుపై, మురికికాలువపై నిర్మించుకున్న నిర్మాణాలను సైతం తొలగించలేదు. మంత్రిగారూ చెప్పిన వినిపించుకోని స్థారుులో మన మున్సిపల్ అధికారులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. నిజమెనండోయ్ వారు ఏమి చేసిన ఒక వర్గం లేకుంటే మరో వర్గానికి వెళ్లోచ్చు అనే తీరును సృష్ఠిస్తున్నారు అధికారులు.
మున్సిపల్ అధికారుల పనితీరు కారణంగా మున్సిపాలిటి మరింత వెనుకబాటుకు గురవుతోంది. డీఎంఏ ఇచ్చిన ఆదేశాలను సైతం భేఖతరు చేస్తూ నామమాత్రంగా కొన్ని ఆక్రమణలు తొలగించి అధికారులు నిశబ్ధంగా ఉన్నారు. కానీ రాష్ట్ర మంత్రి జోగు రామన్న చెప్పిన మాటను ఆమలు చేయకపోవడం పై సర్వత్ర టీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పట్టణంలోని ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్న వైద్యులు ఆసుపత్రులు నిర్మించుకున్నారు. పార్కింగ్ స్థలాలు లేకుండా మురికికాల్వలను మూసివేసి నిర్మాణాలు చేశారు. రోగులతో వాహనాలు వచ్చి వ్యాధిగ్రస్తులు తీసుకువెల్లేంత వరకు రోడ్డుపైనే పార్కింగ్‌లు చేస్తున్నారు. రోడ్లుపై దర్జాగా పార్కింగ్‌లు చేసిన , మురికి కాల్వలపై నిర్మాణాలు చేసిన ఆ ఆసుపత్రులను మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిబంధనల ప్రకారం పార్కింగ్ ఏరియా లేకుండ ఆసుపత్రులు నిర్మించరాదు.
కానీ మన మున్సిపాలిటిలో ని ర్మాణాలు జరిగారుు. కాగా కొందరు గ్రౌండ్‌ప్లోర్ నిర్మించుకుని వాహనాల పార్కింగ్‌కు బదులు దుకాణాలు, మెడికల్ , ల్యాబ్‌ల నిర్వాహణ చేపట్టారు. పట్టణంలోని వివేకానంద చౌక్ నుంచి మొదలుకొని, నేతాజీ చౌక్, శివాజీచౌక్, సినిమా రోడ్డు, ఇలా చాలా చోట్ల ప్రజలు ఆసుపత్రుల వద్ద పార్కింగ్‌తో అవస్థలు పడుతున్నారు.
నోటీసులు లేవు.. పట్టింపులు లేవు..
ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు రోడ్ల పై పార్కింగ్ వ్యవస్థను కొనసాగిస్తున్న మున్సిపల్ అధికారులు నోటీలిచ్చిన దాఖలాలు లేవు. రాష్‌టట్ర మంత్రి జోగురామన్న నోటీసులు అందించమని చెప్పిన ఇప్పటి వరకు అధికారులు ఆ దిశగా అడుగులు వేయనట్లు సమాచారం. దీంతో ఎక్కడ వేసిన గోంగళి అక్కడే అన్నచందంగా ఆసుపత్రిల వద్ద పార్కింగ్ వ్యవస్థ మారింది. ఈ ప్రాంతాలలో పలువురు ప్రమాదాలకు గురైన సందర్బాలు కూడా ఉన్నారుు. ఉన్నతాధికారులకు లేఖరాసి పార్కింగ్ ప్రాంతాలు లేని వారికి నిబంధనల మేరకు లెసైన్‌సలు రద్దు చేసేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.