అనుమతి లేని బోట్‌లో ఎంపీ షికారు
ఎంపీ గల్లా జయదేవ్ నిర్వాకం
సీతానగరం (తాడేపల్లి రూరల్) : అక్రమ వ్యవహారాలకు అడ్డుకట్ట వేసి ఆదర్శంగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధులు అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారు. ఫలితంగా అక్రమార్కులు ప్రభుత్వ నిబంధనలపై మరింత చులకన భావంతో చెలరేగేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. కృష్ణా పుష్కరాలలో భాగంగా శుక్రవారం ఉదయం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌తో కలిసి సీతానగరం ఘాట్‌ను సందర్శించారు. అనంతరం లోటస్ నుంచి బెంగళూరు చాంపియన్‌షిప్ సంస్థకు చెందిన బోట్‌లో తాళ్ళాయిపాలెం వరకూ ప్రయాణించారు. వాస్తవానికి ఇరిగేషన్ శాఖ అనుమతులు ఉంటేనే ఆ బోట్ నదిలో ప్రయాణించాలి. అనుమతులు లేకపోతే రాకపోకలు సాగించడం నిబంధనలకు విరుద్ధం. ఎంపీ జయదేవ్ ప్రయాణించిన బోట్‌కు ఇరిగేషన్ శాఖ అనుమతి లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.