ముదిరాజ్‌లను బీసీ‘ఏ’లో చేర్చాలి
ముదిరాజ్‌లను బీసీ‘ఏ’లో చేర్చాలి
Published Sun, Jul 24 2016 7:47 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
యాదగిరిగుట్ట : రాజకీయంగా వెనుకబడుతున్న ముదిరాజ్ కులస్తులను బీసీ‘ఏ’లో చేర్చాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.జగన్‌మోహన్, జిల్లా అధ్యక్షుడు కొల్ల సైదులు ప్రభుత్వాన్ని కోరారు. యాదగిరిగుట్టలో ఆదివారం ఏర్పాటు చేసిన ఆ సంఘం సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీసీ‘డీ’ నుంచి బీసీ‘ఏ’ గ్రూప్‌లోకి మార్చితే ముదిరాజ్‌లకు అనేక రంగాల్లో అవకాశాలు కలుగుతాయని తెలిపారు. ఆర్డినెస్ ద్వారా బీసీ డీ నుంచి బీసీ ఏ కు మార్చాలని, రూ.వేయి కోట్లతో ప్రత్యేక ఆర్థిక సంస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర జనాభాలో 14శాతం ఉన్న ముదిరాజ్‌లకు టీఆర్‌ఎస్ ఒక ఎమ్మెల్యే సీటు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. ప్రభుత్వం అన్ని కుల సంఘ భవన నిర్మాణాలకు రూ.కోట్లలో నిధులు ప్రకటించి ముదిరాజ్‌లను మాత్రం విస్మరించిందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐక్యవేదిక కన్వీనర్ గుండాల మదన్‌కుమార్, ముదిరాజ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట నర్సింహ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బోళ్ల సుజాత, సంఘం నాయకులు శాగంటి ఉమాపతి, ఆకవరం కృష్ణ, భాషబోయిన రాజేష్, యాట నాగరాజు, పిట్టల బాలరాజు, ఎర్రబోయిన జహంగీర్, మంద రాజు, ఇట్టబోయిన గోపాల్, కూర శేఖర్, శ్రీను తదితరులున్నారు.
Advertisement
Advertisement