‘చంద్రబాబు వియ్యంకుడిలా రివాల్వర్ వాడను’
జగ్గంపేట: తనపై, అనుచరులపై పోలీసు వేధింపులు ఎక్కువయ్యాయని మాజీమంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాజమండ్రిలో సమావేశం పెట్టుకుంటే అడ్డంకులు సృష్టించారన్నారు. సమావేశానికి మండపం ఇచ్చినందుకు తన వియ్యంకుడికి నోటీసులు ఇచ్చారన్నారు. తన వియ్యంకుడిని నిన్న రివాల్వర్‌ను అప్పగించమని పోలీసులు కోరారని, అయితే ఆయన రివాల్వర్‌కు, తనకు సంబంధమేమిటని ముద్రగడ ప్రశ్నించారు.
‘రివాల్వర్ వాడింది చంద్రబాబు వియ్యంకుడు, బావమరిది అయిన బాలకృష్ణ. నేనేమీ ఆయనలా రివాల్వర్ వాడను’ అన్నారు. ఆయన భార్య రివాల్వర్‌ను కూడా బాలకృష్ణ వాడారన్నారు. తాను ఆస్పత్రి అనే జైలులో 14 రోజులు గడిపానని, రాష్ట్రంలో మానవహక్కులు లేవని ముద్రగడ వ్యాఖ్యానించారు.