
రూ. కోటితో కొత్త మార్కెట్ల అభివృద్ధి
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్లకు నిధులు విడుదల చేస్తామని..
♦ రాష్ర్ట రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
♦ పాలమూరు -రంగారెడ్డి ద్వారా పరిగికి నీళ్లు
♦ తండాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు
కుల్కచర్ల: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్లకు నిధులు విడుదల చేస్తామని.. ప్రతి మార్కెట్‌కు మొదటి విడతగా రూ. కోటి కేటాయించి అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రవా ణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం కుల్కచర్ల మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు కుల్కచర్లలో రూ.30లక్షలతో నిర్మించిన స్త్రీశక్తి భవనాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం మార్కెట్ కమిటీ సభ్యులను సన్మానించా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించాల ని.. పంటను అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడకూడదని నూతన వ్యవసాయ మార్కెట్లు ఏర్పా టు చేశామని.. వీటిని రూ.50 కోట్లతో అబివృద్ధి చేస్తామని చెప్పారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి మండల కేంద్రం నుం చి నియోజకవర్గానికి డబుల్ రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామానికి, గిరిజన తండాకు తారురోడ్డు ఏర్పాటు చేయలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పాలమూర్-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా పరిగి నియోజకవర్గం సశ్యశామలం అవుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ కుల్కచర్ల మండలంలో ఏర్పాటు కావడం మండల రైతుల అదృష్టమని మంత్రి చెప్పారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రైతులు పరిగి నియోజకవర్గంలో ఎక్కువమంది ఆత్మహత్య చేసుకున్నారని..
అలాంటి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బూర్యో సభ్యుడు హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తప్ప ఇతర సమయాల్లో రాజకీయం చేయరాదని, రాజకీయం పేరుతో అబివృద్ధి అడ్డుకోకూడదని అన్నారు. అనంతరం లంబాడీ హక్కుల పోరాట సమితి, ట్రేడర్స్ యూనియన్ ఆద్వర్యంలో మంత్రిని సన్మానించా రు. అంతకుముందు మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులతో జిల్లా మార్కెట్ అధికారి ఛాయాదేవి ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, కుల్కచర్ల ఎంపీపీ అరుణ, జెడ్పీటీసీ సభ్యురాలు మంజుల, గండేడ్ ఎంపీపీ శాంతి, జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మి, వైస్ ఎంపీపీ పాండు, కుల్కచర్ల సర్పంచ్ జానకిరాం, ఎంపీటీసీ సభ్యుడు మాలే కృష్ణగౌడ్, ఆంజనేయులు, రాంచందర్‌రెడ్డి, మార్కె ట్ కమిటీ జిల్లా అధికారి రాంచందర్, పీఏసీఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, హరికృష్ణ, వెంకట్, బుడ్డ మ్మ, రాములు, నాగరాజు, రాజప్ప, రాజు, పులి రాములు, రాందాస్, మొగులయ్య పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి ముజాహిద్‌పూర్‌లో టీఆర్‌ఎస్ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పం చ్ సునీత, శ్రీనివాస్, ఆంజనేయులు పాల్గొన్నారు.