ఎస్సార్ఎస్పీకి 'గ్రీస్' కష్టాలు
బాల్కొండ :
ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని అంటు గొప్పగా చెప్పుకునే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మేయింటెనెన్స్ పై నిర్లక్ష్య మేళా అంటు ఆయాకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వరాష్ట్రంలో కూడ ప్రాజెక్ట్ పై పాలకులు చిన్న చూపు చూస్తున్నారని రైతులు విమర్షిస్తున్నారు. ప్రాజెక్ట్ నుంచి మిగులు జలాలు గోదావరిలో వదులుటకు 42 వరద గేట్లను నిర్మించారు. అలానే కాకతీయ కాలువ హెడ్ రెగ్యులేటర్ గేట్లు నాలుగు, లక్ష్మీ కాలువ గేట్లు 2, సరస్వతి కాలువ గేట్లు రెండు వీటన్నింటితో పాటు ప్రస్తుత సంవత్సరం వరద కాలువ ఆరు గేట్లకు ప్రతి ఏటా వేసవి కాలంలో ప్రాజెక్ట్ అధికారులు మేయింటెనెన్స్ చేపడుతారు.
గేట్లకు గ్రీస్, గేట్ల రోప్‌కు ఆయిల్, ప్యూజ్‌లు తదితర మేయింటెనెన్స్ ఉంటుంది. వరద గేట్ల కొన్నింటిలో గేట్లలో టన్ను బక్కెల్ చెడిపోయింది. ఆ గేట్ల మరమ్మత్తులు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. గేట్ల నిర్వహణ కోసం అధికారులు ప్రస్తుత సంవత్సరం 54 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. కాని ఇప్పటికి చిల్లీ గవ్వ మంజూరు కాలేదు. వర్ష కాలం ప్రారంభమైంది. ఎగువ ప్రాంతాల నుంచి ముదస్తుగా వరద నీరు ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరితే నిర్వహణ అటకెక్కినట్లే. వేసవి కాలంలో చేపట్ట వలిసిన పనులు ప్రస్తుతం వర్ష కాలం వచ్చిన మొదలు కాలేదు. ప్రతిపాదనాలు చేసి పంపాల్సిన అధికారులు పంపిన, ప్రభుత్వం నిధులు మంజూరు చేయుటకు మీన మేషాలు లెక్కిస్తునే ఉన్నారు.
దీంతో అధికారులు గేట్ల మెయింటెనెన్స్ ను మరిచి పోయారు. ప్రాజెక్ట్‌పై డ్యాం మేయింటెనెన్స్‌కు ఏఎంఏ( ఏనూవల్ మేయింటెనెన్స్ ఎస్టిమెట్) ఉంటుంది. ప్రభుత్వ మంజూరు చేయాలి. మంజూరు చేసిన బిల్లులను సకాలంలో చెల్లించాలి. కాని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడంతో ప్రాజెక్ట్ పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతుంది. అత్యసరవమైన వరద గేట్ల మేయింటెనెన్స్‌పైనే అధికారులు , ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తుందంటే ప్రాజెక్ట్ పై పాలకుల చిత్త శుద్ది ఎంటో ఆర్థం చేసుకోవచ్చు.
ప్రతి ఏటా సీజన్‌కు ముందు...
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు జూన్ మధ్యలో నుంచి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదలు వచ్చి చేరుతాయి. వరదలు వచ్చే ఆధారంగా ప్రాజెక్ట్ నీటి మట్టం ఆధారంగా ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వార నీటి విడుదలను అధికారులు గోదావరిలోకి విడుదల చేపడుతారు. ప్రతి ఏట సీజన్‌కు మందు గేట్ల మరమ్మత్తులు, మేయింటెనెన్స్ చేపడుతారు. సీజన్‌లో అత్యవసరంగా గేట్లను ఎత్తి నప్పుడు ఎలాంటి సమస్య తలెత్తకుండ గేట్ల మేయింటెనెన్స్ చేపడుతారు. అంతే కాకుండ గేట్లను ఎత్తుటకు ఉప యోగించే క్రేయిన్ రోప్‌కు కూడ మేయింటెనెన్స్ చేపడుతారు.
మేయింటెనెన్స్ చేపట్టినప్పుడే..
వరద గేట్ల మేయింటెనెన్స్ చేపట్టినప్పుడే సీజన్‌లో మొరయించేవి. గతరెండేళ్ల క్రితం ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి నీటి విడుదల చేపడుతున్నప్పుడు పలు వరద గేట్లు మొరాయించాయి. గతేడాది ప్రాజెక్ట్‌నుంచి గోదావరిలోకి నీటి విడుదల చేపట్టినప్పుడు ఆమాత్యుల కళ్ల ముందరనే గేట్లు మొరాయించాయి. అయిన ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. అదికారులు పట్టించు కోవడం లేదని ఆయాకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్న ఇప్పటికి వాటికి పూర్తి స్థాయి మరమ్మత్తులకు దిక్కు లేదు. ఏటా మేయింటెనెన్స్ చేపడుతున్నప్పుడే వరద గేట్లు, కాలువల గేట్లు మొరాయించేవి. ప్రస్తుత సంవత్సరం ఎలాంటి మేయింటెనెన్స్ లేక పోతే వరద గేట్ల పరిస్థితి ఎలా ఉంటుందోనని అధికారులు, ఆయాకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు స్పందించి వెంటనే మెయింటెనెన్స్‌కు నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
నిధులు మంజూరు కాలేదు..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల నిర్వహణ కోçసం 54 లక్షల నిధులతో ప్రతి పాదనలు పంపించాం. ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. వారం రోజుల్లో మంజూరవుతాయని ఉన్నత అధికారులు తెలిపారు. నిధులు మంజూరు కాగనే పనులు చేపడుతాం.
– జగదీష్, డ్యాం డిప్యూటీ ఈఈ, ఎస్సారెస్పీ