అభ్యర్థిని ఎత్తును పరిశీలిస్తున్న అదనపు ఎస్పీ
ఖమ్మం క్రైం : ఖమ్మం పోలీస్ పరెడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ సామర్థ్యపు పరీక్షలు ఎస్పీ షానవాజ్ ఖాసీం అ«ధ్వర్యంలో మంగళవారం ప్రశాంతంగా నిర్వహించారు. మొత్తం 1200 మందికిగాను 926 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 100 మీటర్ల పరుగు పందెంలో ఓ అభ్యర్థి పరిగెడుతూ కింద పడిపోవటంతో అతన్ని పోలీస్ సిబ్బంది స్టెచర్ మీద తీసుకోని వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికష్ణ, డీఎస్పీలు సురేష్‌కుమార్, అశోక్‌కుమార్, మాణిక్‌రాజ్, సంజీవ్, సీఐలు మొగిలి, వెంకటనర్సయ్య, ఎంటిఓ నాగేశ్వరరావు పాల్గొన్నారు.