డేంజర్ పవర్ !
►ప్రాణసంకటంగా విద్యుత్ లైన్లు
►మనుషులకే కాదు పశువులకూ ప్రమాద భరితం
►ఏళ్ల తరబడి మార్చని కండక్టర్లు
►కొత్త కండక్టర్ మార్చినట్లు కాగితాలకే పరిమితం
►పెచ్చుమీరుతున్న సిబ్బంది, అధికారుల అవినీతి
►సిబ్బంది కొరతతో అవస్థలు
►ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ లేకపోవటంతో భీతిల్లుతున్న ప్రజలు
కాస్తంత గాలి వీచినా..చిన్నపాటి వర్షం కురిసినా నేలవాలే విద్యుత్ స్తంభాలు.. చేతికందే ఎత్తులో వేలాడే తీగలు.. పసిపిల్లలకు కూడా అందేంత ఎత్తులో ట్రాన్స్‌ఫార్మర్లు.. రక్షణ లేని ఫీజు కారియర్లు అడుగడుగునా మృత్యు పాశాలై ప్రజలకు ప్రాణసంకటాలుగా మారాయి. వర్షాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఇంకా ఎక్కువ. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లపై సాక్షి నెట్‌వర్క్ కథనం.
ఒంగోలు సబర్బన్: విద్యుత్ కనపడదు...అయితేనేమి సరఫరా ఉన్న తీగ తగిలితే ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోవాల్సిందే. విద్యుత్ వైర్లు రెండు తగిలినా...కొమ్మలు రాసుకున్నా...లేక వరిగడ్డిలాంటివి వైర్లకు తగిలినా అగ్గిరాజుకుంటుంది. విద్యుత్ సిబ్బంది, అధికారులకు విద్యుత్ ప్రభావం ఏంటో బాగా తెలుసు. కానీ అవినీతి రొచ్చులో పొర్లుతూ నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నా విద్యుత్ లైన్ల పర్యవేక్షణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో మనుషులకే కాదు మే నెలలోనే తరగుతులు ప్రారంభించి సెప్టెంబర్‌లోగా సిలబస్ పూర్తి చేస్తున్నాయి. ఆ తర్వాత మూడు, నాలుగు సార్లు తిరిగి బోధిస్తుంటారు. ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం జూలై నెల పూర్తి కావస్తున్నా అధ్యాపకులు నియామకంపై ఉత్తర్వులు ఇవ్వలేదు.
జూనియర్ కళాశాలలు తెరచి రెండు నెలలు పూర్తి కావస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు కాంట్రాక్టు అధ్యాపకుల సేవలను వినియోగించుకున్న ప్రభుత్వం ఇటీవలే ఆ మూడు నెలల వేతనాన్ని విడుదల చేసింది. ఏప్రిల్‌లో విద్యా సంవత్సరం ముగిసిపోగా జూన్ వరకు ఎలాంటి వేతనాలు లేవు. ఆ సమయంలో అప్పటికప్పుడు ప్రత్యామ్నాయ ఉపాధి దొరక్క వారి కుటుంబాల ఆకలితో అలమటించాయి. జిల్లాలో 30 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో శాశ్వత ప్రాతిపదికన కేవలం 107 మంది అధ్యాపకులుండగా 241 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులున్నారు. అన్ని కళాశాలల్లో కలిపి సుమారు 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మద్దిపాడు జూనియర్ కళాశాలలో అందరూ రెగ్యులర్ అధ్యాపకులే ఉండగా అక్కడ విద్యార్థుల సంఖ్య మాత్రం నామమాత్రంగా ఉంది.
అదే విధంగా దొనకొండ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ మినహా మిగిలిన అధ్యాపకులందరూ కాంట్రాక్ట్ వారే. గతేడాది పని చేసిన కాంట్రాక్ట్ అధ్యాపకులకు సాధారణంగానే ఈ ఏడాది కూడా కొనసాగేలా జూన్ మొదటి వారంలోనే బాండ్లు తీసుకుంటారు. కానీ జూలై ఆఖరికి కూడా రెన్యువల్ జీవో విడుదల కాలేదు. మొదటి నెల వేతనం ఇంకా వారి ఖాతాలో పడలేదు. ఉద్యోగ భద్రత లేక, కుటుంబ పోషణ భారమై ఆర్థికంగా, మానసికంగా ఆవేదన చెందుతున్నారు. జూన్ నెలలో తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు ఫీజులు, పుస్తకాలు, దుస్తులు కొనుగోలు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అందించాలన్న నిబంధన అమలు కావడం లేదు. గతేడాది వరకు నెలకు రూ.18 వేలు వేతనం అమలైంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలలో పనిచేసే అధ్యాపకులకు రూ.37 వేలు వేతనం అందిస్తోంది. ఇతర ప్రయోజనాలనూ కల్పిస్తోంది. ఇక్కడ ఎందుకు అమలు చేయడం లేదని జూనియర్ లెక్చరర్ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఇచ్చే వేతనం కూడా మూడు నెలలకొకసారి, ఆరు నెలలకొకసారి ఇస్తున్నారు. మహిళా అధ్యాపకులకు ప్రసూతి సెలవులు ఇవ్వకపోవడంతో జీతం లేని సెలవులు పెట్టుకోవాల్సి వస్తోంది.
కుంటుపడుతున్న చదువులు
ప్రభుత్వ కళాశాలల్లో ప్రధాన బోధకులు కాంట్రాక్ట్ అధ్యాపకులే కావడం, వారికి రెన్యువల్ ఉత్తర్వులు రాకపోవడంతో పర్యవేక్షణ గాడి తప్పింది. వీరికి బయోమెట్రిక్ హాజరు విధానం లేదు. వచ్చే నెల నుంచి అధ్యాపకులకు, పిల్లలకు బయోమెట్రిక్ విధానం వస్తుందని అధికారులు చెప్తున్నారు. రెన్యువల్ విషయంపై ఎలాంటి ప్రకటన లేకపోవడంతో అధ్యాపకులు ఉంటారా.. ఉండరా అనే అనుమానం విద్యార్థుల్లో కూడా వ్యక్తమవుతోంది. రెన్యువల్ ఉత్తర్వులు రాకపోవడంతో బోధన కుంటుపడుతుందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. కుటుంబ పోషణ జరగని అధ్యాపకులు ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలకు గెస్ట్‌లుగా తరగతులు బోధించడం, ఇతరత్రా పనుల్లో ఉంటున్నారు. అంతిమంగా విద్యార్థులు నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోకపోగా సమస్యలను కూడా తీర్చడం లేదు.