
'అలా జరిగితే ఏపీ తట్టుకోవడం కష్టం'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని సీపీఎం నేత ప్రకాశ్ కారత్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. గుజరాత్ తిరస్కరించిన అణువిద్యుత్ కేంద్రాలను ఏపీలో పెట్టడం సరికాదన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అణు ప్లాంట్లపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని చెప్పారు. జపాన్ లాంటి ఘటనలు జరిగితే ఏపీ తట్టుకోవడం కష్టమన్నారు. కొవ్వాడలో అణువిద్యుత్ ప్లాంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కారత్ డిమాండ్ చేశారు.