నాన్‌ హాస్టల్‌ ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ | pre metric schloarship for non hostel sc students | Sakshi
Sakshi News home page

నాన్‌ హాస్టల్‌ ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌

Published Thu, Sep 8 2016 12:54 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

ఎస్సీ విద్యార్థులందరూ ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌లు పొందేలా చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌–2 రామస్వామి సాంఘిక సంక్షేమ అధికారులు, విద్యాశాఖాధికారులను ఆదేశించారు.

– 15 వరకు దరఖాస్తుల స్వీకరణ  
–జేసీ–2 రామస్వామి వెల్లడి
కర్నూలు(అగ్రికల్చర్‌): ఎస్సీ విద్యార్థులందరూ ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌లు పొందేలా చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌–2 రామస్వామి సాంఘిక సంక్షేమ అధికారులు, విద్యాశాఖాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ మీటింగ్‌ హాలులో బుధవారం నిర్వహించిన సమావేశంలో జేసీ–2 మాట్లాడారు. 5 నుంచి 10వ తరగతి వరకు నాన్‌ హాస్టల్‌ విద్యార్థులకు ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌లు మంజూరు చేస్తామన్నారు. 5 నుంచి 8వ తరగతి చదివే బాలికలకు రూ.1500, బాలురకు రూ.1000, 9,10వ తరగతుల విద్యార్థులకు రూ.2250 ప్రకారం అందిస్తామన్నారు. రేషన్, ఆధార్‌ కార్డు, బ్యాంకుఖాతా పుస్తకం, తల్లితండ్రల ఆధార్‌ కార్డులు, ఆదాయ, కుల ధవీకరణ పత్రాలతో ఈ నెల 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ డీడీ ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement