ఆర్‌బీఐ తీరుకు నిరసన
జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో రద్దయిన నోట్ల మార్పిడి, డిపాజిట్లు స్వీకరించడాన్ని ఆర్‌బీఐ నిషేదించడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా సహకార కేంద్రబ్యాంకు అధికారులు శుక్రవారం బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహించారు.
– నోట్ల మార్పిడి, డిపాజిట్లకు అవకాశం కల్పించాలని డిమాండ్
– రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఉత్తర్వులు సడలించాలి
- కేడీసీసీబీ ఎదుట ధర్నా
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో రద్దయిన నోట్ల మార్పిడి, డిపాజిట్లు స్వీకరించడాన్ని ఆర్‌బీఐ నిషేదించడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా సహకార కేంద్రబ్యాంకు అధికారులు శుక్రవారం బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహించారు. కర్నూలు జిల్లా సహకార కేంద్రబ్యాంకు ఉద్యోగుల యూనియన్, ఏపీ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్లు సంయుక్తంగా నిర్వహించిన ధర్నాకు కేడీసీసీబీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, సీఈఓ రామాంజనేయులు, డీజీఎంలు ఉమామహేశ్వర రెడ్డి, సునిల్‌కుమార్, శివలీల, ఏజీఎంలు పద్మావతి, నూర్‌అహ్మద్‌బాషా తదితరులు సంఘీభావం ప్రకటించారు. చైర్మన్ మాట్లాడుతూ రైతులకు అండగా ఉంటున్న ఈ బ్యాంకులో డిపాజిట్లు,నోట్ల మార్పును నిషేదించడం తగదన్నారు.దీంతో రైతులు నుంచి రికవరీలు చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. వెంటనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.యూనియన్‌ల నేతలు మాట్లాడుతూ ఉత్తర్వులను సడలించకపోతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. జిల్లా సహకార కేంద్రబ్యాంకు ఉద్యోగుల యూనియన్ నేతలు రాఘవేంద్ర, త్రీనాథ్‌రెడ్డి, నాగమద్దిలేటి, ఏపీ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు ఈశ్వరరెడ్డి, శివరామకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు