అమరచింతలో రాస్తారోకో నిర్వహిస్తున్న మహిళలు
తాగునీటి కోసం రాస్తారోకో
Published Thu, Aug 11 2016 1:23 AM | Last Updated on Thu, Oct 4 2018 5:34 PM
ఆత్మకూర్ (నర్వ): అమరచింత గ్రామంలోని సంతోష్‌నగర్ కాలనీ వాసులకు వారం రోజుల నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ఆ కాలనీ వాసులు బుధవారం రోడెక్కి రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీకి చెందిన పలువురు మహిళలు ఖాళీ బిందెలతో ర హదారిపై వాహన రాకపోకలను అడ్డుకుని బైఠాయించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి వ్యవస్థ అçస్తవ్యస్తంగా కొనసాగుతుందన్నారు. పాలకులు, అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. వారంరోజుల నుంచి నీటి కష్టాలను అనుభవిస్తున్న పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడమేమిటని నిరసన వ్యక్తం చేశారు. రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో మరికల్ – ఆత్మకూర్ రహదారిపై వాహన రాకపోకలు భారీ స్థాయిలో నిలిచిపోయాయి. ఈ మేరకు ఉపసర్పంచు మమతసత్యనారాయణ ఆందోళన కారుల వద్దకు వచ్చి తాగునీరు సకాలంలో సరఫరా అయ్యేల తనవంతు కషి చేస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు.
Advertisement
Advertisement