Published
Fri, Sep 16 2016 8:33 PM
| Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
యాద్గార్‌పల్లి రోడ్డుకు మరమ్మతులు
మిర్యాలగూడ రూరల్: మిర్యాలగూడ పట్టణం నుంచి యాద్గార్‌పల్లి వెళ్లే రహదారిని ఆర్‌ఎండ్‌బీ అధికారులు మరమ్మతులు చేసి శుక్రవారం రాకపోకలను పురుద్ధరించారు. ఈ నెల 13న కురిసిన భారీ వర్షం వల్ల యాద్గార్‌పల్లి చెరువు నుంచి వరద నీరు రావడంతో రోడ్డు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయిన విషయం విధితమే. దీంతో యాద్గార్‌పల్లి, ఊట్లపల్లి, తడకమళ్ల, తక్కెళ్లపహాడ్, క్వాపల్లి గ్రామాలకు మిర్యాలగూడకు గతనాలుగు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకొన్న ఆర్‌ఎండ్ బీ అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టారు.