పండుగలా గణతంత్ర వేడుకలు | republic day as festival | Sakshi
Sakshi News home page

పండుగలా గణతంత్ర వేడుకలు

Published Sun, Jan 22 2017 12:37 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

republic day as festival

- పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయండి
–జిల్లా అభివృద్ధిపై స్టాళ్లు నెలకొల్పండి
– ఏర్పాట్లపై సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ 
కర్నూలు(అగ్రికల్చర్‌): గణతంత్ర దినోత్సవాన్ని పండుగలా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ అధికారులను ఆదేశించారు. ఈ నెల 26న పోలీస్‌పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే గణతంత్ర  వేడుకల ఏర్పాట్లపై   శనివారం కలెక్టర్‌ తన చాంబరులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాను అన్ని విధాల అభివృద్ది పథంలోకి తెచ్చామని, అభివృద్ధి కళ్లకు కనబడే విధంగా స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. నీటిపారుదల,  వ్యవసాయం ఉద్యానశాఖ, పశుసంవర్ధకశాఖ, డీఆర్‌డీఏ, డ్వామా, సంక్షేమం, పౌరసరఫరాలతో సహా 14 శాఖల అధికారులు తమ శాఖల ప్రగతిపై ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేయాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులను రిపబ్లిక్‌ డే నాడు సత్కరించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఉదయం 7.45 గంటలకే జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తానా​‍్నరు. సాంస్కృతిక ప్రదర్శనలకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.  ప్రోటోకాల్‌ ప్రకారం ఆహ్వానపత్రికలు ముద్రించి అందచేయాలని తెలిపారు.సమావేశంలో జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ,  జేసీ హరికిరణ్, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement