టీటీడీకి రూ.3 కోట్ల ఆస్తి రాసిస్తా ! | Rs.3 crore worth land gift to ttd, says Padmavathamma | Sakshi
Sakshi News home page

టీటీడీకి రూ.3 కోట్ల ఆస్తి రాసిస్తా !

Published Tue, Jul 28 2015 11:42 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM

టీటీడీకి రూ.3 కోట్ల ఆస్తి రాసిస్తా !

టీటీడీకి రూ.3 కోట్ల ఆస్తి రాసిస్తా !

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముందుకు వస్తే తన రూ.3 కోట్ల విలువైన ఆస్తి రాసి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం కడిగిరి గ్రామానికి చెందిన పద్మావతమ్మ (70) వెల్లడించారు. సోమవారం తిరుమలకు వచ్చిన ఆమె విలేకర్లతో మాట్లాడారు. తనపేరు మీద, తన భర్త గోపాల్‌శెట్టి పేరు మీద కడిగిరి గ్రామంలో రూ. మూడు కోట్ల విలువైన భూమి ఉందని చెప్పారు.

ఆ భూమిని కొంత మంది ఆక్రమించుకున్నారని చెప్పారు. అధికారులు ముందుకు వస్తే... ఆ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా టీటీడీకి రాసిస్తానని, సంబంధిత పత్రాలను కూడా అందజేస్తానని ప్రకటించారు. అలాగే తన ఆరోగ్యం కుదుటపడేందుకు అధికారులు సాయం చేయాలని ఆమె టీటీడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement