శ్రీశైలంలో సచ్చిదానంద ఆశ్రమ పీఠాధిపతి
శ్రీశైలంలో సచ్చిదానంద ఆశ్రమ పీఠాధిపతి
Published Sun, Nov 27 2016 10:30 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైలం: కార్తీక మాసం సందర్భంగా శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల సన్నిధిలో ఆదివారం రాత్రి కోటి దీపార్చన మహోత్సవానికి తూర్పుగోదావరి జిల్లా తుని సచ్చిదానంద ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామిజీ హాజరయ్యారు. ప్రధానాలయగోపురం వద్ద ఈఓ భరత్ గుప్త స్వామీజీకి బిల్వమాల ఇచ్చి ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం స్వామీజీ నాగులకట్ట వద్ద ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవ మహోత్సవంలో పాల్గొని శాస్త్రోక్తపూజల అనంతరం దీపార్చనను ప్రారంభించారు.
Advertisement
Advertisement