సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్
బిందుసేద్యం అమలులో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ట్రైబల్ సబ్ ప్లాన్, వెట్టిచాకిరీపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
చిత్తూరు కలెక్టరేట్: బిందుసేద్యం అమలులో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ట్రైబల్ సబ్ ప్లాన్, వెట్టిచాకిరీపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో కొళాయిలు ఏర్పాటు చేసి నీటి సౌకర్యం కల్పించాలన్నారు. రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలన్నారు. దళితవాడల్లో రోడ్డు సౌకర్యం తప్పనిసరిగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వెట్టిచాకిరి కేసులు గుర్తించి ఇందులో బాధితులను రక్షించే చర్యలు పటిష్టంగా చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జేసీ గిరీషా, జేసీ–2 వెంకటసుబ్బారెడ్డి, డీఆర్వో విజయచందర్, జడ్పీ సీఈవో పెంచలకిశోర్, ఆర్డీవో కోదండరామిరెడ్డి, సీపీఓ భాస్కర్‌శర్మ, వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ వేణు, హార్టికల్చర్ జేడీ ధర్మజ, డీఈవో నాగేశ్వరరావు పాల్గొన్నారు.