స్కూల్కి నగలతో రాకూడదంటూ దోచుకెళ్లాడు | School student robbed of Gold in Vijayawada | Sakshi
Sakshi News home page

స్కూల్కి నగలతో రాకూడదంటూ దోచుకెళ్లాడు

Published Sun, Jun 19 2016 1:43 PM | Last Updated on Sat, Sep 15 2018 5:45 PM

స్కూల్కి నగలతో రాకూడదంటూ దోచుకెళ్లాడు - Sakshi

స్కూల్కి నగలతో రాకూడదంటూ దోచుకెళ్లాడు

విజయవాడ పటమట వద్ద సినీ ఫక్కీలో చోరీ జరిగింది. స్థానిక నిర్మలా స్కూల్లో ఐదవ తరగతి విద్యార్థిని నగలు ఆగంతకుడు చోరీ చేశారు.

విజయవాడ : విజయవాడ పటమట వద్ద సినీ ఫక్కీలో చోరీ జరిగింది. స్థానిక నిర్మలా స్కూల్లో ఐదవ తరగతి విద్యార్థిని నగలు ఆగంతకుడు చోరీ చేశారు.  శనివారం పుట్టిన రోజు కావడంతో బంగారు నగలతో విద్యార్థిని స్కూల్కి వెళ్లింది. నగలు పెట్టుకుని స్కూల్కి రాకూడదంటూ.. విద్యార్థిని బుజ్జగించి... ఆమె నగలు తీసుకుని దుండగుడు అక్కడ నుంచి ఉడాయించాడు.

తీరా సాయంత్రం ఇంటికి చేరిన.. విద్యార్థిని బంగారు నగల గురించి... తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో నగలు అంకుల్ తీసుకున్నారని చెప్పింది. స్కూల్కు వెళ్లి సిబ్బందిని బంగారు నగలపై విచారించిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆదివారం ఉదయం సదరు బాలిక తల్లిదండ్రులు పడమట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి గురైన బంగారం రూ. 5 లక్షలు ఉంటాయని విద్యార్థిని తల్లిదండ్రులు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement