వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ నీతూ ప్రసాద్
ముకరంపుర : హరితహారంలో భాగంగా జిల్లాల్లో నాటిన మొక్కల నిర్వహణపై సూక్ష్మ ప్రణాళికను రూపొందించి పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్నారు. హరితహారంపై మంగళవారం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మొక్కలకు నీరు పోయడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ వినియోగించుకోవాలని, అవసరమైతే అగ్నిమాపకశాఖ సేవలు తీసుకోవాలని సూచించారు.
-
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ
-
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు ఆదేశం
ముకరంపుర : హరితహారంలో భాగంగా జిల్లాల్లో నాటిన మొక్కల నిర్వహణపై సూక్ష్మ ప్రణాళికను రూపొందించి పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్నారు. హరితహారంపై మంగళవారం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మొక్కలకు నీరు పోయడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ వినియోగించుకోవాలని, అవసరమైతే అగ్నిమాపకశాఖ సేవలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులు మొక్కల నిర్వహణపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రతి మొక్కకూ జవాబు చెప్పాల్సి ఉంటుందన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో జియోటాగింగ్ చేయాలని తెలిపారు. మొక్కల నిర్వహణకు వివిధ సంస్థలు ఇస్తున్న విరాళాలపై ప్రత్యేక ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించారు. జాతీయ, రాష్ట్ర రోడ్లకిరువైపులా నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మొక్కలు నాటడంలో లక్ష్యాన్ని సాధించిన గ్రామాల వివరాలను పంపించాలని పేర్కొన్నారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో విరివిగా మెుక్కలు నాటి త్వరలోనే లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో జియోటాగింగ్ సిస్టం ద్వారా మొక్కల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. పండ్ల మెుక్కలకు ప్రజల నుంచి డిమాండ్ ఉందని, వాటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మొక్కలు బతికించుకోవడానికి ఆకస్మిక తనిఖీలు చేపడతామని తెలిపారు. సూక్ష్మప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. అవసరమైన చోట బోర్లను వేయించి మెుక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వీటి నిర్వహణకు రూ.30లక్షలు గ్రామ పంచాయతీలకు ఇచ్చామని తెలిపారు. కరీంనగర్ నగర పాలకసంస్థ కమిషనర్ కృష్ణభాస్కర్, అదనపు జేసీ డాక్టర్ నాగేంద్ర, డీఆర్‌వో వీరబ్రహ్మయ్య తదితరులున్నారు.