
సింధు విజయం సాధించాలని విద్యార్థుల ర్యాలీ
ఒలింపిక్ బ్యాట్మింటన్ పోటీలో ఫైనల్ మ్యాచ్‌లో పోటీ పడుతున్న సింధు విజయం సాధించాలని కోరుతూ ఆమెకు మద్దతుగా శుక్రవారం సిద్ధార్థ కాన్సెప్ట్ పాఠశాల విద్యార్థులు దుబ్బాకలో ర్యాలీ నిర్వహించారు.
దుబ్బాక రూరల్:ఒలింపిక్ బ్యాట్మింటన్ పోటీలో ఫైనల్ మ్యాచ్‌లో పోటీ పడుతున్న సింధు విజయం సాధించాలని కోరుతూ ఆమెకు మద్దతుగా శుక్రవారం సిద్ధార్థ కాన్సెప్ట్ పాఠశాల విద్యార్థులు దుబ్బాకలో ర్యాలీ నిర్వహించారు. సింధు విజయం సాధించాలని నినాదాలు చేశారు. ప్లకార్డులు, జాతీయ జెండా పట్టుకుని పట్టణంలోని ప్రతి వీధి తిరిగారు. విజయం సాధించి భారతీయుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె.రవీందర్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
మిరుదొడ్డి: బ్యాడ్మింటన్‌లో సింధు గెలుపొందాలని కోరుతూ శుక్రవారం మిరుదొడ్డిలో పలు క్రీడాకారులు స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గొట్టం భైరయ్య, పురోహితులు విఠాల రాజపున్నయ్య శర్మ, క్రీడాకారులు వేణు, ప్రధీప్, దశరథం, బాల్‌రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.