
పాముకాటుకు గురై మృతి చెందిన పూజిత (ఫైల్)
నారాయణపురం (కల్లూరు) : మండలంలోని నారాయణపురం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి పాము కాటు వేయడంతో విద్యార్థిని మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బీసీ కాలనీకి చెందిన బిల్లకంటి సావిత్రి కుమార్తె పూజిత (15) కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. సోమవారం రాత్రి చాప వేసుకుని కింద పడుకుంది. అర్ధరాత్రి సమయంలో పాము కాటు వేయడంతో కుటుంబ సభ్యులు పూజితను కల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పాఠశాల హెచ్‌ఎం మాధవరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మృత దేహాన్ని సందర్శించారు.