తండ్రి మరణాన్ని తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య | son suicide due to father's death in khammam district | Sakshi
Sakshi News home page

తండ్రి మరణాన్ని తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య

Published Wed, Dec 23 2015 4:55 PM | Last Updated on Sun, Sep 3 2017 2:27 PM

son suicide due to father's death in khammam district

ఖమ్మం: తండ్రి మరణాన్ని తట్టుకోలేక మనస్తాపానికి గురైన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన శీలం నర్సింహారెడ్డి(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడటంతో.. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన కుమారుడు నాగిరెడ్డి బుధవారం బావిలోదూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు అతని మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తండ్రీ కొడుకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement