పాఠశాల ఆవరణ పరిశీలిస్తున్న ఎస్పీ బ్రహ్మారెడ్డి
ఎచ్చెర్ల: ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారాలని జిల్లా ఎస్పీ బ్రహ్మారెడ్డి అన్నారు. ఎచ్చెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను దత్తత తీసుకున్న ఆయన మంగళవారం పాఠశాలను పరిశీలించారు. మౌలిక వసతులు పరిశీలించి గోడలకు సున్నం వేయించడం, కిటికీలకు గ్రిల్స్ ఏర్పాటు వంటి పనులు చేశారు. ప్రైవేట్ పాఠశాలలకంటే ప్రభుత్వ పాఠశాలలు పైచేయి సాధించాలని, విద్యార్థుల్లో నైపుణ్యాలు వెలలికి తీయడం, ప్రతిభను ప్రోత్సహించడం, అవసరమమైన స్టడీ మెటీరియల్ అందించడం కీలకంగా చెప్పారు. 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఇప్పటి నుంచే విద్యార్థులకు ప్రత్యేక బోధన ప్రారంభించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణ పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ వివేకానంద, ఆర్మ్‌డ్ రిజర్వు ఆర్‌ఐ కోటేశ్వరబాబు, స్థానిక హెచ్‌ఎం వసంతరావు ఉన్నారు.