అవినీతిపరులపై ఎస్పీ నిఘా | sp alert on illegal persons | Sakshi
Sakshi News home page

అవినీతిపరులపై ఎస్పీ నిఘా

Published Fri, Sep 22 2017 10:48 PM | Last Updated on Fri, Sep 22 2017 11:13 PM

sp alert on illegal persons

– ఇప్పటికే పలువురు సీఐలపై వేటు
– మరో ఎస్‌ఐ వీఆర్‌కు రంగం సిద్ధం

అనంతపురం సెంట్రల్‌: పోలీసుశాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై ఎస్పీ అశోక్‌కుమార్‌ నిఘా ఉంచి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఒకేసారి ఐదుగురు సీఐలకు స్థానచలనం కలిగింది. వీరంతా వీఆర్‌కు వెళ్లడం పోలీసుశాఖలో తీవ్ర చర్చనీయాంశం అయింది. విధి నిర్వహణలో విమర్శలు ఎదుర్కొంటున్నట్లు వీరిలో కొంతమందిపై అభియోగాలు ఉన్నాయి. అందులో భాగంగా కొంతమందిపై వేటు వేసినట్లు చర్చించుకుంటున్నారు. తాజాగా తాడిపత్రి డివిజన్‌లో ఓ ఎస్‌ఐపై వేటుకు రంగం సిద్దమైంది. మట్కా, పేకాటరాయుళ్లతో సంబంధాలు పెట్టుకున్నారని విచారణలో తేలడంతో చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం. రెండు, మూడురోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నాయని పోలీసువర్గాల ద్వారా తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement