అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు.
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
- సమాచారం ఇస్తే చర్యలకు శ్రీకారం
- ఫోన్.. మెసేజ్.. వాట్సాప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ
- బెల్టు దుకాణాలు, మట్కా, పేకాట నిర్మూలనే ధ్యేయం
అనంతపురం సెంట్రల్: అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. ప్రజలు కూడా పోలీసు శాఖకు సహకరించాలని.. బెల్టు షాపుల నిర్వహణ, మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్, ఈవ్‌టీజింగ్‌పై తన సెల్‌ఫోన్ 9989819191 నెంబర్‌కు సమాచారం అందించాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు. నేరుగా కాల్ చేసినా.. ఎస్‌ఎంఎస్ పంపినా.. వాట్సాప్ ద్వారా సమాచారం చేరవేసినా ఫిర్యాదును స్వీకరిస్తామన్నారు. డయల్ 100 కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అసాంఘిక కార్యకలాపాలతో పాటు రోడ్డు ప్రమాదాలు, అల్లర్లు, ఇతర ఆపద సమయాల్లోనూ ఈ నెంబర్లను సంప్రదించవచ్చన్నారు. ఈ నెంబర్లు పూర్తిగా తన స్వీయ పర్యవేక్షణలో ఉంటాయని.. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.