అనంతపురం సెంట్రల్ : జిల్లాలో డ్రైవింగ్ లైసెన్స్‌లు లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. సోమవారం నుంచి వారం రోజుల పాటు జిల్లా అంతటా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాల నడిపే వారిపై ముమ్మర తనిఖీలు చేపడుతామన్నారు. అన్ని పోలీసు స్టేషన్ అధికారులను ఇప్పటికే ఆదేశించామన్నారు. వాహన ప్రమాదాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. కొందరు యజమానులు తమ వాహనాలను ఇతరులకు ఇచ్చే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అని ఆలోచించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.
నెలన్నర కిందట జిల్లాలో మడకశిర పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ లేని యువకుడికి ద్విచక్ర వాహనం ఇచ్చి పరోక్షంగా రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు చట్టరీత్యా నేరమన్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతమైతే యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహన తనిఖీల సమయంలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
వాహన లైసెన్సు తప్పనిసరి
Published Sun, Jul 9 2017 11:21 PM | Last Updated on Tue, Sep 5 2017 3:38 PM
Advertisement