చండికా పరమేశ్వరికి విశేషపూజలు
Published Tue, Jul 26 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
పెళ్లకూరు: చిల్లకూరు వడ్డిపాళెంలో జరుగుతున్న చండికా పరమేశ్వరి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి అభిషేకాలు, అర్చనలు జరిపారు. సాయంత్రం మహాహోమం జరిగింది. పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాత్రి అమ్మవారి పల్లకీసేవ నేత్రపర్వంగా సాగింది. ఈ పూజా కార్యక్రమాలకు ఉభయకర్తలుగా కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి వ్యవహరించారు. ఆలయ ధర్మకర్త రాజామాతాదేవి భక్తులకు ప్రవచనం చేశారు.
Advertisement
Advertisement